Housing minister of AP Jogi Ramesh hits back to Pawan Kalyan over House for poor scheme | పేదలందరికీ ఇళ్లు పథకంపై జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ చేపట్టిన ఆందోళనపై గృహ నిర్మాణ శాఖ మంత్రి జోగి రమేష్ ఘాటు విమర్శలు గుప్పించారు. ఆయన చేపట్టిన విజయనగరం జిల్లా గుంకలాం పర్యటనను తప్పుపట్టారు. ఈ సభ అట్టర్ ఫ్లాప్ అయిందని వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్‌ను వీకెండ్ గెస్ట్ ఆర్టిస్ట్‌గా అభివర్ణించారు. రాష్ట్రవ్యాప్తంగా లక్షల సంఖ్యలో ఇళ్ల నిర్మాణం జరుగుతుంటే పవన్ కల్యాణ్, చంద్రబాబు, నారా లోకేష్ చూడలేకపోతున్నారంటూ ఎద్దేవా చేశారు.

#PowerstarPavankalyan
#TDP
#Janasena
#CMjagan
#ChandraBabuNaidu
#JogiRamesh
#2024APelections